సామాజిక న్యాయం మా ప్రభుత్వం విధానం అన్నారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన నిర్మలా.. స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా కోట్ల మందికి ఉపాధి కల్పించామన్నారు. చట్ట సభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్లు కల్పించామన్నారు. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపడతామన్నారు.
()4.50 కోట్ల మందికి బీమా సౌకర్యం కల్పించాం
()జీఎస్టీ ద్వారా ఒక దేశం ఒక పన్ను విధానాన్ని అమలు చేస్తున్నాం.
()కోవిడ్ వల్ల ఎన్నో దేశాలు తీవ్ర సమస్యలు ఎదుర్కోగా.. భారత్ విజయవంతంగా అధిగమించింది.
()రాష్ట్రంలో, జిల్లాల్లో ఆర్థిక పరిస్థితులు మెరుగుపర్చడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుంది.
()గ్రామీణ ప్రాంతాల్లో మూడు కోట్ల గృహ నిర్మాణాన్ని సాధించాం.
()నానో యూరియా విజయవంతం కావడంతో.. నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాం.
()మత్స్య సంపద ప్రోత్సాహానికి ప్రత్యేక శాఖ .
()బస్తీలు, అద్దె ఇళ్లలో ఉండేవారి సొంతింటి కలను నరవేరుస్తాం.
()ఇంటి నిర్మాణానికి, కొనుగోలుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది.
()ఆశాలు, అంగన్ వాడీలకు ఆయుష్మాన్ పథకం వ్తింపు.
()80కోట్ల మందికి ఉచిత రేషన్ బియ్యం ద్వారా ఆహార సమస్యను పరిష్కరించాం.
()అవినీతి నిరోధించాం.. పాలనలో పారదర్శకత
()25కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం.
()34లక్షల కోట్ల రూపాయలను నేరుగా నగదు బదలీ ద్వారా పేదలకు అందించాం.
()11.8 కోట్ల మంది రైతులకు నేరుగా నగదు సాయం అందిస్తున్నాం.
()నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామికవేత్తలు పుట్టుకొచ్చారు.
()సబ్ కా సాథ్.. సబ్కా వికాస్ మా నినాదం.
()2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ గా అవతరించేందుకు కృషి చేస్తున్నాం.
()అన్నదాతలకు కనీస మద్దతు ధరను దశలవారిగా పెంచాం.
()నాణ్యమైన విద్య అందిస్తున్నాం.
(0పదేళ్లలో ఉన్నత విద్య చదివే అమ్మాయిల సంఖ్య 28శాతం పెరిగింది.
()గత పదేళ్లలో 7 ఐఐటీ, 7ఐఐఎం, 16 ట్రిపుల్ ఐటీలు, 390 యూనివర్శిటీలు, 15 ఎయిమ్స్ లు ఏర్పాటు.
()యువత అభివృద్ధికి ఎన్నో చర్యలు తీసుకున్నాం.
()స్కిల్ ఇండియా మిషన్ తో 1.40కోట్ల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించాం
()2023లో చెస్ లో 80మంది గ్రాండ్ మాస్టర్లు తయారయ్యారు.
()ఔత్సాహిక మహిళా పారిశ్రామిక వేత్తలకు 30వేల కోట్లు ముద్రా రుణాలు.
()పీఎం ఆవాస్ యోజన కింద ఇచ్చిన ఇళ్లలో 70శాతం మహిళలకే.
Also Read:Nirmala:అవినీతిని గణనీయంగా తగ్గించాం
()9 నుంచి 14ఏళ్లలోపుబాలికలకు వ్యాక్సినేషన్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారణకు చర్యలు.
()ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పు లేదు.
()పదేళ్లలో ఎన్నో పన్నుల సంస్కరణలు చేపట్టాం.
()జీఎస్టీ పన్ను విధానం వల్ల వ్యాపార, పారిశ్రామిక రంగాలు పూర్తి సంతృప్తిగా ఉన్నాయి.