Budget 2024:హల్వా వేడుక..ఆనవాయితీ ఇదే

21
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం ఎన్నికల వేళ ఈసారి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక ఏటా బడ్జెట్‌కు ముందు సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్ధిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహిస్తారు. నిర్మలా సీతారామన్ హల్వా కలిపి ముద్రణా పనుల్లో పాల్గొనే ఉద్యోగులందరికీ పంచారు.

బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక నిర్వహించడానికి గల కారణాన్ని చూస్తే ఏటా బడ్జెట్ ప్రతులకు సంబంధించిన ముద్రణ వ్యవహరాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. బడ్జెట్ ప్రతుల ముద్రణలో పాల్గొనే సిబ్బంది మొత్తం, ముద్రణ పూర్తి అయి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశ పెట్టే వరకూ వారంతా ఆర్థిక శాఖ కార్యాలయంలోని నార్త్ బ్లాక్ లోనే ఉంటారు. ఆ సమయంలో వారు ఇంటికి కూడా వెళ్లరు.

సిబ్బంది తమ పనిలో నిమగ్నం కావడానికి ముందు తీపి తినిపించాలనే ఉద్దేశంతో హల్వా తయారు చేయడం ఆనవాయితీగా వస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను జూలైలో సమర్పించనున్నారు.

Also Read:ఆలుగడ్డ జీర్ణం కావడానికి ఎంత సమయం పడుతుంది?

- Advertisement -