- Advertisement -
2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి మరికాసేపట్లో పార్లమెంట్లో బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మాలాసీతారామన్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ క్రమంలో మంత్రులు నిర్మాలా సీతారామన్, అనురాగ్ ఠాగూర్.. ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం నుంచి పార్లమెంట్‌కు చేరుకున్నారు.
ఉదయం 11.00 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ బడ్జెట్ కు ఆమోదం తెలిపింది. ఇక కేబినెట్ భేటీకి ముందే.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను నిర్మలా సీతారామన్ కలిశారు. గత బడ్జెట్ సమావేశంలో.. సంప్రదాయాన్ని పక్కన బెడుతూ.. బడ్జెట్ కాపీలను ఎర్రటి వస్త్రంతో చుట్టిన సంచీలో తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
- Advertisement -