ఫస్ట్ షెడ్యూల్ పూర్తీ చేసుకున్న “ఫైటర్”

388
vijay

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ మూవీ ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా ఈమూవీ తర్వాత విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇటివలే ప్రారంభమైన ఈసినిమా షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో జరుపుకుంది. నిన్నటితో ఫస్ట్ షెడ్యూల్ ముగిసింది. ఇక రెండవ షెడ్యూల్ ను హైదరాబాద్ లో చిత్రికరించనున్నారు. ఈమూవీకి ఫైటర్ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈచిత్రంలో మార్ష‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్‌గా విజయ్ దేవ‌ర‌కొండ క‌నిపించ‌నున్నారు. అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈమూవీని సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే.