బుద్ధుడు చూపిన మార్గం… నేటికి స్పూర్తిదాయకం

91
- Advertisement -

గౌతమ బుద్దుడు..ఈ పేరు గుర్తుకు రాగానే అహింసా సిద్దాంతం గుర్తొస్తుంది. జీవికి కష్టలెందుకు అని ఆలోచించి, అన్వేషణ మొదలు పెట్టిన గొప్పతనం,చింతలన్నింటికీ కోరికలే కారణమని నిగ్గుతేల్చిన అపూర్వమేధస్సు సాక్షత్కరిస్తుంది. శాంతంతో కొవాన్ని, సత్వకథతో హింసను, ప్రేమతో ద్వేషాన్ని, సత్యంతో అసత్యాన్ని జయించాలని పిలుపునిచ్చిన మహానీయుడు. అందుకే ఆయచ చూపిన మార్గం ఇప్పటికి, ఎప్పటికి సదా ఆచరణీయమే.

వివేకానందుడు, మహాత్మగాంధీ, సర్వేపల్లి రాధాకృష్ణ వంటి వారెందరికో అయన బోధనలు ఆదర్శం. బుద్ధుడు ప్రబోధించిన సత్యాలు సర్వకాలికం, సార్వజనీనం అని వివేకానందుడు చెప్పాడు. హింసతో నిండిపోయిన నేటి ప్రపంచానికి అయన వచనాలు ఒక ఊరట. ఇవాళ బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఆ మహానీయుడిని ఓసారి స్మరించుకుందాం.

Also Read:సంగీత ప్రపంచంలో కిషన్‌ మహారాజ్ దృవతార..

గౌతమ బుద్దుడి అసలు పేరు సిద్ధార్థుడు. క్రీస్తు పూర్వం 563 లో శుద్దోధనుడు, మహామాయాదేవి దంపతులకు కపిలవస్తు సమీపంలోని లుంబిని గ్రామంలో జనమించాడు. దుః ఖనికి కారణాన్ని వెతకాలి నిశ్చయించుకున్నాడు. కుటుంబాన్ని త్యజించి, సన్యాసిగా మారదు. రావి చెట్టు (బోధి వృక్షము) కింద కుర్చీని కొన్ని రోజులపాటు ధ్యానంలో మునిగిపోయాడు. బుద్దుడిగా మారాడు. ఇదే నా చివరి జన్మ. ఇక ముందు నాకు ఎలాంటి జన్మలు ఉండవు అన్నవి అయన తొలిపలుకులు.

బుద్ధం శరణం గచ్చామి

(బుద్ది. మనస్సుకు దారి చూపే చుక్కాని)

ధర్మం శరణం గచ్చామి

(ధర్మం అనేది మనం నడవాల్సిన మార్గం)

సంఘం శరణం గచ్చామి

(మనతోపాటు జీవించే మానవ సమాజంతో కలిసి మనం నడవాలి)

Also Read:బీఆర్ఎస్ ఆఫీస్ ఓపెనింగ్.. హైలైట్స్‌

బుద్దుని జయంతిని పురస్కరించకుని చేసుకునే పండగ ఇది. ఈరోజు గౌతమ బుద్ధుడు బోధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు. బోధి వృక్షానికి పాలు పోసి కొవ్వొత్తి వెలిగిస్తారు. పేద ప్రజలకు అన్నదానం చేస్తారు. ఈ పవిత్రమైన రోజున విష్ణువును పూజించడం వల్ల విశేష ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు.

బుద్దుని ప్రవచానాల్లో ప్రముఖమైనవి..

() మనల్ని మనం తప్ప మరెవరూ రక్షించలేరు. మనకోసం ఎవరూ ఏం చేయలేరు, చేయాలని అనుకోరు. మన బాటలో మనం నడవాలి.
()మన ఆలోచనల ద్వారానే మనం రూపుదిద్దుకుంటాము, మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అలాంటి వ్యక్తిగా మారతాం.
()మనస్సు స్వచ్ఛంగా ఉన్నప్పుడు, ఆనందం ఎప్పటికీ వదలని నీడలా అనుసరిస్తుంది.
(0మీరు సాధించిన ఘనతను అతిగా అంచనా వేయకండి, అలాగే ఇతరులను చూసి అసూయపడకండి. ఇతరులను చూసి అసూయ చెందేవాడు ఎన్నటికీ మనశ్శాంతిని పొందలేడు.
()కరిగిపోవడం వలన కొవ్వొత్తి జీవితం తరిగిపోదు, ఒక్క కొవ్వొత్తి నుండి వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు. మీ జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల, మంచిని వ్యాప్తి చేయడం వల్ల మీ ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది.

Also Read:Harishrao:రాజ్యాంగంలో రాసుందా?

()శాంతి అనేది మీ లోపలి నుండి వస్తుంది, బయట నుంచి కోరుకోవద్దు.
()మరణం, దుఃఖం నుండి ఎవరూ తప్పించుకోలేరు. జీవితంలో సంతోషాన్ని మాత్రమే ఆశించేవారు నిరాశ చెందుతారు.
()మీ పని మీ ప్రపంచాన్ని కనుగొనడం మరియు మీ హృదయంతో దానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవడం.
()మీరు మరొకరి జీవితంలో దీపం వెలిగిస్తే, అది మీ మార్గాన్ని కూడా ప్రకాశవంతం చేస్తుంది.

- Advertisement -