చరణ్ కొత్త కథకు సుఖాంతం

101
- Advertisement -

రామ్ చరణ్ – బుచ్చిబాబు కథకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అయితే, తాజాగా బుచ్చిబాబు కథ మొత్తానికి సుఖాంతం అయింది. ఫిబ్రవరి మూడోవారంలో ఈ సినిమా సెట్ మీదకు వెళ్ళబోతోంది. ఇన్నాళ్లు కథ విషయంలో వచ్చిన డిస్కషన్లు అన్నీ బుచ్చిబాబు – చరణ్ సినిమాకు హర్డిల్స్ గా మారాయి. దాంతో కథలో అనేక మార్పులు చేర్పులు చేసి.. కథను ఫిక్స్ చేసుకోవడంలో బుచ్చిబాబు సతమతమయ్యాడు.

అయితే, తాజాగా ఫైనల్ స్క్రిప్ట్ పై క్లారిటీ వచ్చింది. కాకపోతే.. కథలో మార్పులు కారణంగా సినిమా కీలక కాస్ట్ అండ్ క్రూలో కూడా మార్పులు రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. మొదట అనుకున్న సబ్జెక్ట్ లో రామ్ చరణ్ క్యారెక్టర్ లో ఫుల్ యాక్షన్ టచ్ ఉంది. ఇప్పుడు ఫ్యామిలీ సెంటిమెంట్ ను కూడా యాడ్ చేశారు. అలాగే ఈ కథలో కూడా 6 ఫైట్లు వుంటాయి, అవన్నీ చాలా కీలకం. అలాగే సినిమాలో అమితాబ్ బచ్చన్ ను తీసుకునే ప్రయత్నం గట్టిగా చేసారు. కానీ ఇప్పుడు అంత బలమైన నటుడు అవసరం వుందో లేదా అన్నది అనుమానమే.

అలాగే మొదట అనుకున్న సబ్జెక్ట్ ప్రకారం రామ్ చరణ్ మొత్తం మూడు గెటప్స్ లో కనిపిస్తాడు. కానీ.. కొత్తగా చేసిన మార్పులు చేర్పులు కారణంగా రెండు గెటప్స్ లో మాత్రమే చరణ్ కనిపించబోతున్నాడు. అలాగే మొదట రామ్ చరణ్ సరసన ఇద్దరు హీరోయిన్లను అనుకున్నారు. కానీ ఇప్పుడు ఒక్క హీరోయిన్ కే స్కోప్ ఉందట. అలాగే ఒక పాపులర్ సీనియర్ హీరోయిన్ ను ట్రయ్ చేస్తున్నారు. ఆమె బాలీవుడ్ సీనియర్ బ్యూటీ టబు అని రూమర్లు ఉన్నాయి. మొత్తం మీద ఇలా ఫుల్ పెర్ఫెక్ట్ గా ఫ్రెష్ గా చరణ్- బుచ్చిబాబు సినిమా స్టార్ట్ కాబోతోంది.

ఇవి కూడా చదవండి…

ఈ సంక్రాంతి ‘శృతి’ దే !

నిరాశపరిచిన బాహుబలి ఎపిసోడ్స్

నాగబాబు V/s రోజా… మాటల యుద్ధం

- Advertisement -