బీఎస్ఎన్ఎల్ బంపర్‌ ఆఫ‌ర్..

264
BSNL
- Advertisement -

రిల‌యెన్స్ జియో దెబ్బ‌కు ఒక్కో టెలికాం ఆప‌రేట‌ర్ దిగొస్తోంది. త‌మ వినియోగదారులు జారిపోకుండా చూసుకునేందుకు టెలికాం కంపెనీలు రోజుకో ఆఫర్ ను ప్రవేశపెడుతున్నాయి. ఇప్ప‌టికే వొడాఫోన్‌, ఎయిర్‌టెల్, ఐడియా ప‌లు ఆఫ‌ర్ల‌తో ఆక‌ర్షిస్తుండ‌గా.. తాజాగా ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా ఓ సూప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది.

ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.1,999 కి ఓ నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్ వాలిడిటీని 365 రోజులుగా నిర్ణయించారు. దీంతో మొత్తం అన్ని రోజులకు గాను 730 జీబీ డేటా వస్తుంది.

BSNL

అయితే ఈ ప్లాన్ ప్రస్తుతం తమిళనాడు సర్కిల్ వినియోగదారులకు మాత్రమే లభిస్తున్నది. ప్రమోషనల్ ఆఫర్ కింద ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టారు. త్వరలో ఇతర సర్కిల్స్‌లోనూ ఈ ప్లాన్‌ను లాంచ్ చేసే యోచనలో బీఎస్‌ఎన్‌ఎల్ అధికారులు ఉన్నారు. ఇక జియోలో రూ.1,999 ప్లాన్‌కు 125 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 180 రోజులుగా ఉండగా దీనికి పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్ రూ.1,999 ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

- Advertisement -