జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపరాఫర్‌..!

185
- Advertisement -

జియో పోటీని తట్టుకునేందుకు టెలికాం సంస్థలు వినియోగదారులను రకరకాల ఆఫర్లతో ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్‌, ఐడియా సంస్థలు పలు ఆఫర్లను ప్రకటించాయి. తాజాగా ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. రోజుకు 2జీబీ 3జీ డాటాతోపాటు 28 రోజుల పాటు బీఎస్‌ఎన్ ఎల్-టు- బీఎస్‌ఎన్‌ఎల్ ఉచితంగా అపరిమిత కాలింగ్ సదుపాయం కల్పించింది.

ఇందుకు రూ.339 చార్జీ చేయనున్నది. ఈ ప్రత్యేక ఆఫర్ 90 రోజుల పాటు అందుబాటులో ఉండనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఉచిత నిమిషాలు అయిన తరువాత మాట్లాడే ప్రతి కాల్‌కు నిమిషానికి 25పైసలు చొప్పున వసూలు చేయనుంది. రూ.339తో రీఛార్జిపై ఈ సదుపాయాలను పొందొచ్చు. 28 రోజుల కాలపరిమితిపై ఈ ప్యాక్‌ను అందిస్తున్నట్లు ఓ ప్రకటనలో బీఎస్‌ఎన్‌ఎల్‌ తెలిపింది. ప్రస్తుతం టెలికం రంగంలోని ఆఫర్లలో రోజుకు 2జీబీ డాటా ఇవ్వడం ఇదే తొలిసారని బీఎస్‌ఎన్‌ఎల్ డైరెక్టర్ ఆర్‌కే మిట్టల్ తెలిపారు. వినియోగదారులకు తక్కువ ధరకే సేవలు అందించడానికి కట్టుబడి ఉన్నామనడానికి ఈ ప్రత్యేక ఆఫర్లే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -