జియోకు పోటీగా బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ఆఫర్‌..

260
BSNL has launched a 'Data Tsunami' offer
- Advertisement -

ప్రైవేటు టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్ ల నుంచి పోటీని తట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. డేటావినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో బీఎస్ఎన్ఎల్ తన ప్రీ పెయిడ్ మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త డేటా ఆఫర్ ను ప్రకటించింది. డేటా సునామీ ఆఫర్ కింద రూ.98కే ఓ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తాజాగా అందుబాటులోకి తెచ్చింది. దీంట్లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌కు వాలిడిటీని 26 రోజులుగా నిర్ణయించారు.

BSNL has launched a 'Data Tsunami' offer

అంటే మొత్తం 26 రోజులకు గాను 39 జీబీ డేటా వినియోగదారులకు లభిస్తుంది. ఈ క్రమంలో 1 జీబీ డేటా ఖరీదు కేవలం రూ.2.51 మాత్రమే అవుతుంది. ఇక జియోలో రూ.149 ప్లాన్ అందుబాటులో ఉండగా అందులో రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అలాగే ఎయిర్‌టెల్‌లోనూ రూ.149 ప్లాన్ ఉంది కానీ ఇందులో 1 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే తక్కువ ధరకే బీఎస్‌ఎన్‌ఎల్ రూ.98 ప్లాన్ లభిస్తుండడం విశేషం. అయితే ఈ ప్లాన్‌లో కస్టమర్లకు కేవలం డేటా మాత్రమే వస్తుంది. ఎలాంటి కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు రావు.

- Advertisement -