చినజీయర్ ఆశీస్సులు తీసుకున్న కర్ణాటక సీఎం

538
yediyurappa chinajeear swamy
- Advertisement -

కర్ణాటక సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కు వచ్చారు యెడియూరప్ప. గురువారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి శ్రీరామనగరంలోని చినజీయర్ ఆశ్రమాన్ని సందర్శించారు. చినజీయర్ ఆశీస్సులు తీసుకున్నారు.

ఈ సందర్భంగా సీఎం యడియూరప్పను స్వామీజీ సత్కరించి మంగళాశాసనాలు అందజేశారు. తొలిసారి చినజీయర్‌ స్వామి ఆశ్రమాన్ని సందర్శించిన యడ్డీకి, శ్రీరామనగరంలోని కుటీరం వద్ద వేదపండితులు శాస్త్రోక్తంగా స్వాగతం పలికారు. గురువారం రాత్రి ఆయన ఆశ్రమంలోనే బస చేశారు.

స్వామిజీని కలవడం ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కర్ణాటక సీఎం తెలిపారు. రెండు వారాల తర్వాత మరోసారి ఆశ్రమానికి రానున్నట్టు వెల్లడించారు. శుక్రవారం ఉదయాన్నే ఆయన బెంగళూరుకు పయనమయ్యారు. రెండు రోజుల వ్యవధిలో తెలంగాణ, కర్ణాటక సీఎంలు చినజీయర్‌ స్వామి ఆశ్రమాన్ని సందర్శించడంతో భద్రతా సిబ్బంది, అధికారులతో శ్రీరామనగరం సందడిగా మారింది.

- Advertisement -