BRSV:బనకచర్లను అడ్డుకుంటాం

4
- Advertisement -

గోదావరిలో తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం అనే నినాదంతో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రతి కాలేజీ ప్రతి విద్యార్థికి వివరించి చైతన్యం చేయాలనే ఉద్దేశంతో నేటి నుండి 5 రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

అందులో భాగంగా హైదరాబాద్ లోని బీఆర్ఎస్వీ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో బనకచర్ల ప్రాజెక్ట్ వల్ల గోదావరి నదిలో 200 టీఎంసీల నీటి వాటాను తెలంగాణ కోల్పోయే పరిస్థితిని, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు తెలంగాణ ప్రాంత ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కరపత్రాల ద్వారా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులకు శాంతియుతంగా వివరిస్తుండగా, పోలీసులు అడ్డుకుని అక్రమంగా విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు.

Also Read:Jurala:జూరాలకు పోటెత్తిన వరద..

రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగ బాలు, కడారి స్వామి యాదవ్, పడాల సతీష్ మరియు బీఆర్ఎస్వీ నాయకులు కిషోర్ గౌడ్, కోదాటి నాగేందర్, జీడి అనిల్, కటం శివ, నరేష్, అవినాష్, సతీష్ నాగేందర్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

- Advertisement -