BRSLP సమావేశం 21కి వాయిదా

6
- Advertisement -

బిఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ఈ నెల 19వ తేదీన నిర్వహించాల్సిన బిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మరియు బిఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని ఈ నెల 21వ తేదీకి వాయిదా వేయడం జరిగింది అని తెలిపారు మాజీ మంత్రి హరీష్‌ రావు.

ఈ నెల 19వ తేదీతో పార్లమెంట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం కోసం వాయిదా వేయడం జరిగింది అన్నారు.

కేసీఆర్ అధ్యక్షతన ఈ నెల 21వ తేదీన తెలంగాణ భవన్ వేదికగా నిర్వహించే బిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు పాల్గొననున్నారు అని చెప్పారు.

Also Read:Modi:విజయ్ దివస్‌..చారిత్రాత్మక విజయం

- Advertisement -