కన్నవారిని రోడ్డున వదిలేస్తే కఠిన చర్యలు!

5
- Advertisement -

తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల కనీస ధర్మమని వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. కన్నవారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడం, వేధించడం లేదా రోడ్డున వదిలేయడం వంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. వృద్ధుల పట్ల జరిగే అన్యాయంపై పోలీస్ శాఖ కఠినంగా స్పందిస్తుందని స్పష్టమైన సందేశం ఇచ్చారు.

సమాజంలో కొంతమంది తమ తల్లిదండ్రులను భారం లాగా చూస్తూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన సజ్జనార్, ఇది మానవీయ విలువలకు విరుద్ధమని అన్నారు. దిక్కుతోచని పరిస్థితుల్లో, తమ గోడు ఎవరూ వినడం లేదని కుమిలిపోతున్న ప్రతి వృద్ధుడికి, ప్రతి తల్లికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

వృద్ధులపై నిర్లక్ష్యం, మానసిక లేదా శారీరక హింస జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇలాంటి కేసుల్లో బాధితులు ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. వారి భద్రత, ఆత్మగౌరవం, శ్రేయస్సు పోలీస్ శాఖకు అత్యంత ముఖ్యమని తెలిపారు.

“మీరు ఒంటరి వారు కాదు. సమాజం, ప్రభుత్వం, పోలీస్ శాఖ మీ వెంటే ఉంటుంది. మీ హక్కుల కోసం పోరాడటానికి మేము సిద్ధంగా ఉన్నాం” అంటూ వీసీ సజ్జనార్ వృద్ధులకు ధైర్యం చెప్పారు. తల్లిదండ్రులను గౌరవించడం, వారి బాగోగులు చూసుకోవడం ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అని మరోసారి గుర్తు చేశారు.

Also read:కాంగ్రెస్ గుండాగిరిపై కేటీఆర్ కన్నెర్ర..

- Advertisement -