BRS:నేడు మంత్రి కేటీఆర్ షెడ్యూల్ ఇదే

59
- Advertisement -

గత 6 రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు మంత్రి కేటీఆర్. ఆరు రోజుల్లో 25 నియోజకవర్గాల్లో కేటీఆర్ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మంత్రి కేటీఆర్ రోడ్ షోలకు మంచి స్పందన వస్తోంది. కేటీఆర్ రోడ్ షోల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

ఇక ఇవాళ నాలుగు నియోజకవర్గాల్లో రోడ్ షోలు నిర్వహించనున్నారు మంత్రి కేటీఆర్. మధ్యాహ్నం ఒంటి గంటకు దుబ్బాకలో, 3 గంటలకు ముస్తాబాద్ మండల్‌(సిరిసిల్ల) రోడ్ షోలో పాల్గొననున్నారు. సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు సనత్‌నగర్‌ నియోజకవర్గం రోడ్ షోలో పాల్గొననున్నారు కేటీఆర్.

కాంగ్రెస్ పాలనలో జరిగిన అవినీతి, బీఆర్ఎస్ పదేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ మంత్రి కేటీఆర్ ప్రసంగం సాగుతోంది. ఇక కేటీఆర్ సభలకు జనం పోటెత్తుండటంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:Sethakka:సీతక్క కు ఓటమి తప్పదా?

- Advertisement -