బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నీ తానై.. తెలంగాణకు తానున్నానంటూ కదిలివచ్చారు. ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేకున్నా.. ఎలాంటి రాజకీయ లబ్ధి జరిగే సందర్భంగా కాకున్నా.. ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి కేసీఆర్ ప్రజల్లోకి వచ్చారు. ప్రజల పక్షాన తాను కొట్లాడతానని, జనంలోనే ఉంటానని ప్రకటించారు. దీంతో రాష్ట్ర ప్రజలంతా ఆయన కోసం కదిలివచ్చారు. కేసీఆర్ ప్రసంగం ప్రతి గడప కు చేరింది. ప్రతి చెవి విన్నది. కేసీఆర్ ప్రసంగానికి ప్రతి గుండె స్పందించింది. కేసీఆర్ పాలనను ప్రతి మనసు తలచుకుంది.
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలి వచ్చారు. రాష్ట్రంలో మొత్తం కోటి వరకు కుటుంబాలు ఉంటే అందులో దాదాపుగా సగానికిపైగా ఆదివారం జరిగిన సభలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మమేకమయ్యారు. సర్కారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. వివిధ మార్గాల్లో దాదాపు 10 లక్షల మంది ప్రజలు సభాస్థలికి వచ్చారు. ప్రత్యక్షంగా కేసీఆర్ గారి ప్రసంగాన్ని విన్నారు. సర్కారు అడ్డంకుల కారణంగా వేలాది మంది ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. అయినా సరే సభస్థలికి వచ్చి మరీ వెనుదిరిగారు. పలు ఛానళ్లు యూట్యూబ్ లో చేసిన లైవ్ ను దాదాపుగా 15 లక్షల మంది వరకు వీక్షించారు. ఇవి కాకుండా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలను మరో 10 లక్షలకు పైగా కుటుంబాలు చూశాయి. రాష్ట్రంలో నిన్న సాయంత్రం ఎక్కడ చూసినా.. ఏ ఇంట్లో, ఫోన్లో చూసినా.. కేసీఆర్ గారి ప్రసంగమే వినిపించింది. చివరకు సీఎం, మంత్రులంతా కూడా ఒకే దగ్గర కూర్చుని మరీ కేసీఆర్ గారి ప్రసంగం ఆధ్యంతం విన్నారంటే.. ఆయన ప్రసంగంపై ప్రజలకే కాదు.. సీఎం, మంత్రులు కూడా ఎంత ఆతృతతో ఉన్నారో అర్థమవుతోంది.
ఏప్రిల్ 27న రాష్ట్ర జనాభాలో 50 శాతానికిపైగా కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూశారు. తెలంగాణ జనాభా: 3.85 కోట్లు. తెలంగాణ కుటుంబాలు: 1.15 కోట్లు. తెలంగాణ ఓట్లు: 3.32 కోట్లు. కేసీఆర్ ప్రసంగానికి స్పందన: 1.5 కోట్లు. అంటే ఆయన మాటల కోసం ప్రజలు ఏ స్థాయిలో వేచి చూశారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారో కూడా దీన్నిబట్టి స్పష్టం అయ్యింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలోనే బీఆర్ఎస్ సభ నిర్వహిస్తే ఈ స్థాయిలో ప్రజల నుంచి స్పందన రావడాన్ని బట్టి చూస్తే.. దాదాపు 60% తెలంగాణ ప్రజలు కేసీఆర్ కి జై కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 100 సీట్లు రావడం పక్కా అనేది కూడా రుజువైంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో నూకలు చెల్లిపోయాయనేది కూడా స్పష్టమైంది. హస్తం సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న మోసాలను ప్రజలు గుర్తించలేదని ఇన్నాళ్లు కాంగ్రెస్ వాళ్లు అనుకున్నారు. కానీ.. వాస్తవాలేంటో ప్రజలకు తెలిసిపోయాయనేది బయటపడిపోయింది. బీఆర్ఎస్ సర్కారు రావాలని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ఆశగా ఉన్నారు.రజతోత్సవ సభతో ఇవన్నీ బయటపడటంతో కాంగ్రెస్, బీజేపీ నాయకులకు నిద్ర పట్టడం లేదు. సభను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించి.. ఇప్పుడు కేసీఆర్ గారిపై విమర్శలు చేస్తున్నారు. చిల్లర మల్లర ఆరోపణలు చేస్తున్నారు. కానీ నిజమేంటో ప్రజలకు తెలిసిపోయింది.
Also Read:అలా అయితే పాకిస్తాన్‌కే వెళ్లండి:పవన్

