KTR:అభివృద్ధిలో న్యూయార్క్‌తో పోటీ

52
- Advertisement -

అభివృద్ధిలో హైదరాబాద్..న్యూయార్క్‌తో పోటీ పడుతోందన్నారు మంత్రి కేటీఆర్. శనివారం హైదరాబాద్‌లో పార్ట్‌నర్స్‌ ఇన్‌ ప్రోగ్రెస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొన్న కేటీఆర్…ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని అన్నారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి చెప్పారు.

హైదరాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందినదని నటుడు రజినీకాంత్‌ పొగిడిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు.హైదరాబాద్‌ను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గణనీయంగా అభివృద్ధి చేసిందన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో మంచి పురోగతి సాధించామని చెప్పారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ కళ్ల ముందే కనిపిస్తోందన్నారు. ఈ మహానగరానికి చారిత్రకంగా గొప్ప పేరుందని అన్నారు. గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైవోర్లు నిర్మించామని, 39 చెరువులను నవీకరించామని చెప్పారు. మిషన్‌ భగీరథ కార్యక్రమంతో హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని తెలిపారు. దేశంలో నిరంతరాయంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

Also Read:సందీష్ భాటియాతో కేటీఆర్..ప్రోమో అదుర్స్

- Advertisement -