Harishrao: ఏ సర్వే చూసినా కారుదే జోరు

46
- Advertisement -

ఏ సర్వేలు చూసినా కారుదో జోరు కనిపిస్తోందన్నారు మంత్రి హరీశ్ రావు. ఆర్మూరు మాణిక్ బండార్ రోడ్ షో లో మాట్లాడిన హరీశ్‌..ఇండియా టుడే సర్వే ప్రకారం కేసీఆర్ మూడో సారి సీఎం అవుతారని స్పష్టం అయ్యిందిన్నారు. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశాం అని బాధపడుతున్నారన్నారు.కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మితే మోస పోతాం అని…ఆసుపత్రులు బాగా చేసుకున్నాం అన్ని అభివృద్ధి చేశాం అన్నారు. నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద బిడ్డ సర్కారు దవాఖాన అంటున్నారన్నారు.

జీవన్ రెడ్డి ఆపద వస్తే ఆదుకుంటాడు… కరోనా సమయంలో అండగా ఉన్నడాన్నారు. కాంగ్రెస్ వాళ్ళు పుర్రె గుర్తు పెడితే, బిజెపి వాళ్ళు జీఎస్టీ వేశారన్నారు.కానీ సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నారని చెప్పారు.పేదోల్ల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారని…వచ్చే ప్రభుత్వంలో పాత బియ్యం, సన్నబియ్యం ఇవ్వబోతున్నామన్నారు. సౌభాగ్య లక్ష్మి ద్వారా 3 వేల రూపాయలు ఆడ బిడ్డకు ఇవ్వబోతున్నామన్నారు.

బిజెపి వాళ్ళు తిట్టూడు తప్ప, అభివృద్ధి గురించి చెప్పరని…400 సిలిండర్ 12 వందలు చేసింది బిజెపి కాదా ఆలోచించాలన్నారు.మనం 400 లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామని..అసైన్డ్ ల్యాండ్స్ కి పట్టాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి అని మండిపడ్డ హరీశ్..బూతులు మాట్లాడే వాళ్ళకు కాదు భవిష్యత్తు నిర్ణయించే వాళ్లకు ఓటు వేయాలన్నారు.ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న తెలంగాణ కెసిఆర్ చేతుల్లో ఉంటేనే ఫలితం ఉంటుందని…జీవన్ రెడ్డిని మంచి మెజార్టీతో గెలిపిస్తే ఆర్మూర్ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.నిజామాబాదులో 9 కి 9 సీట్లు బి ఆర్ ఎస్ గెలుస్తుంది. ఎలాంటి సందేహం లేదని…కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి డిపాజిట్ కూడా రాదన్నారు.

Also Read:హ్యాపీ బర్త్ డే…నయన్

- Advertisement -