BRS: రుణమాఫీ జరగని రైతుల కోసం టోల్ ఫ్రీ నెంబర్

7
- Advertisement -

రుణమాఫీ జరగని రైతుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..1 లక్షలోపు రుణం ఉన్న రైతులు మా ప్రభుత్వంలో 39 లక్షల మంది రైతులు ఉంటే, ఆ సంఖ్య ఇప్పటికీ పెరిగి 45 లక్షలు అయిందన్నారు.

కానీ ఈ ప్రభుత్వం లక్షన్నర రుణమాఫీ అని చేసింది కేవలం 16 లక్షల మంది రైతులకేనని తెలిపారు. మరి మిగతా రైతుల రుణమాఫీ సంగతి ఏంటి అని ప్రశ్నించారు. అర్హులై రుణమాఫీ జరగని రైతులకు బీఆర్ఎస్ టెక్ సెల్ టోల్ ఫ్రీ నంబర్ – 8374852619 ఏర్పాటు చేశామన్నారు.

అర్హులైన రైతులు లక్షన్నరలోపు బ్యాంకులో రుణం తీసుకొని ఉండి, మీకు రుణమాఫీ జరగకపోతే ఈ వాట్సప్ నంబర్‌కి మీ వివరాలు పంపాలని తెలిపారు. తెలంగాణ భవన్లో ఇద్దరు అధికారులను ఈ సమస్య మీదనే నియమించాం అని వెల్లడించారు.

నా నియోజకవర్గంలోని బోరంపేట్ ప్రాథమిక వ్యవసాయ శాఖకు సంబంధించిన బ్యాంకులో 632 మంది రుణాలు తీసుకుంటే అందులో కేవలం 14 మందికి ఇప్పటి వరకు రుణమాఫీ జరిగిందని తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద. రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు వివేకానంద.

Also Read:పిఠాపురంలో ‘కమిటీ కుర్రోళ్ళు’

- Advertisement -