రాహుల్ గాంధీ కోసం బిర్యానీతో వెయిటింగ్!

5
- Advertisement -

రాహుల్ గాంధీ గారు పోయినేడాది ఎన్నికల సమయంలో ఇదే నవంబర్ నెల 25వ తేదీనాడు హైదరాబాద్ వచ్చారు అన్నారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వినర్ సతీష్ రెడ్డి. అశోక్ నగర్ కు వచ్చి నిరుద్యోగులను కలిశారు. వారికి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. నెల రోజుల్లో ఏడాది పూర్తి కాబోతోంది. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయో చెప్పి వెళ్లండి. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అది ఏమైందో కూడా చెప్పండి. ఇప్పుడు కూడా అదే బావర్చీకి వచ్చి బిర్యానీ తిని.. ఓ సారి నిరుద్యోగులతో మాట్లాడి వెళ్లండి. అలాగే.. ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి మీరిచ్చిన ఆరు గ్యారంటీలు ఎందాక వచ్చాయో కూడా తెలుసుకోవాలన్నారు.

అలాగే రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్ లోని ఎనుమాముల మార్కెట్ కు వెళ్లి రైతులను కలవండి. ఎరువులు, విత్తనాలకు వాళ్లు పడుతున్న ఇబ్బందులు.. పండించిన పంటను మీ కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో వారు పడుతున్న ఇబ్బందులను గురించి అడిగి తెలుసుకోండని సూచించారు. మా రాష్ట్ర మంత్రులేమో కేరళ, జార్ఖండ్ లో బిజీగున్నరు. ముఖ్యమంత్రి మహారాష్ట్ర, కేరళ అంటూ తిరుగుతున్నారు. మీరు తెలంగాణలో గెలిచిన ఇన్న రోజుల తర్వాత వచ్చారు. కాబట్టి ఇప్పుడైనా ప్రజలను, రైతులను, విద్యార్థులను కలిసి వెళ్లండి. మీ కోసం అదే బావర్చి దగ్గర ఎదురు చూస్తున్నం అని చెప్పారు.

Also Rad:Harish: రాహుల్‌ జీ.. అ’శోక’ నగరాన్ని సందర్శించండి

- Advertisement -