రుణమాఫీ..బీఆర్ఎస్ నిరసన

2
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. రూ.2 లక్షల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో నల్లబ్యాడ్జీలతో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని సభలో నినాదాలు చేశారు. రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లి, పూర్తి రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.

రంగారెడ్డి జిల్లాలో నిన్న సాయంత్రం భారీ గాలులతో కూడిన అకాల వర్షానికి రైతులకు తీవ్ర నష్టం ఏర్పడింది.రంగారెడ్డి జిల్లా మాడుగుల మండలం బ్రాహ్మణపల్లి, నల్లచెరువు, ఇర్విన్, ఆర్కపల్లి, అన్నెబోయినపల్లితో పాటు పలు గ్రామాలలో కురిసిన భారీ వర్షానికి అనేక ఎకరాల్లో మొక్కజొన్న, వరి, జొన్న, సద్దల, బొప్పాయి, మామిడి పంటలు నెలకొరిగాయి. చేతికొచ్చిన పంటలు నేలరాలడంతో ఆందోళన చెందుతున్న రైతులు, ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రైతులు.

Also Read:బెట్టింగ్ యాప్స్‌..పోలీస్ విచారణకు శ్యామల

- Advertisement -