ఎన్నికలు ఏవైనా ఎప్పుడైనా..బి‌ఆర్‌ఎస్ రెడీ!

43
- Advertisement -

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలకు సంబంధించిన చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికి జమిలి ఎన్నికల అమలు కు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ అధ్యక్షతనా కమిటీ కూడా వేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే జమిలి ఎలక్షన్స్ అమలు పై దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఖర్చు తగ్గించేందుకే జమిలి ఎలక్షన్స్ అని బిజెపి చెబుతుంటే.. ఓటమి భయంతోనే అటు వైపు అడుగులు అని విపక్ష పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ జమిలి ఎలక్షన్స్ ప్రతిపాదన తెరపైకి వస్తే.. ఏ ఏ పార్టీలు స్వాగతిస్తాయి.. ఏ ఏ పార్టీలు వ్యతిరేకిస్తాయి అనేడ్ ఆసక్తికరంగా మారింది. .

కాగా ఎన్నికలు ఏవైనా.. ఎప్పుడొచ్చినా బి‌ఆర్‌ఎస్ సిద్దంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పుకొచ్చారు. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివర్లో తెలంగాణతో పాటు మరి ఆయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే జమిలి ప్రతిపాదన తెరపైకి వస్తున్న వేళ ఈ ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉందా ? లేదా పార్లమెంట్ ఎన్నికలే ఈ అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరుగుతాయా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఎన్నికలు ఏవైనా తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ విజయం తథ్యం అనేది ఇప్పటికే సర్వేలు తేల్చి చెప్పాయి. గత ఎన్నికలతో పోల్చితే ఈసారి సీట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని సర్వేలు ఇస్తున్న రిపోర్ట్. ఈ నేపథ్యంలో ప్రత్యర్థి పార్టీలు ఎన్ని కుతంట్రాలు పన్నినా తెలంగాణలో బి‌ఆర్‌ఎస్ 100 కు పైగా సీట్లు కైవసం చేసుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

Also Read:విజయ్ దేవరకొండపై చైతు రివేంజ్

- Advertisement -