రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకుంటోంది అన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన రాకేష్ రెడ్డి….2 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసి వేశారు ..యూనివర్సిటీలను అమ్మేస్తున్నారు ..గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి …ఫీలు రీఇంబర్స్ మెంటు బకాయిలు చెల్లించక పోవడంతో డిగ్రీ కళాశాలలు పరీక్షలు వాయిదా వేస్తున్నాయి …తెలంగాణ విశ్వవిద్యాలయం ఏకంగా సర్క్యులర్ ఇచ్చింది .మిగతా యూనివర్సిటీల్లో ఇదే పరిస్థితి అన్నారు.
వ్యాపారులు ఐపీ పెట్టినట్టుగా ఉంది పరిస్థితి ..గుడి లేని పూజారి లా పంతులు లేని గుడిలా వైద్యుడు లేని ఆస్పత్రిలా తయారైంది విద్యాశాఖ పరిస్థితి ..అకడమిక్ కేలండర్ ను అమలు చేయలేని దయనీయ పరిస్థితి లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది ..సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి ..డిగ్రీ పరీక్షలు వాయిదా వేస్తే జాతీయ స్థాయి పీజీ ఎంట్రన్స్ పరీక్షలు రాసే మన విద్యార్థుల పరిస్థితి ఏమిటీ ?…త్వరలో కాలేజీలు మూసివేసే పరిస్థితి వస్తుంది
…రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఒక్క పైసా ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయి కూడా చెల్లించలేదు …వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు ..ఇచ్చిన మాట నిలుపుకోలేదు అన్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోతే కళాశాలల యాజమానులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది ..సీఎం రేవంత్ రెడ్డి వన్ టైం సెటిల్ మెంట్ గురించి మాట్లాడుతున్నారు ..గతంలో సెటిల్ మెంట్లు చేసి అలవాటై రేవంత్ రెడ్డి సీఎం స్థానం లో కూడా అలానే మాట్లాడుతున్నారు ..సీఎం ,మంత్రుల జల్సాలకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు ..కానీ ఫీజు రీ ఇంబర్స్ మెంట్ బకాయిలు మాత్రం చెల్లించడం లేదు ..వంద కిలోమీటర్ల దూరానికి సైతం మంత్రులు హెలికాఫ్టర్ ను వాడుతున్నారు ..సీఎం ఢిల్లీ టూర్ల ఖర్చు 300 కోట్ల రూపాయల తో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు తీర్చొచ్చు …కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీ ఎంబెర్స్ మెంట్ డబ్బులు రాకపోవడం తో విద్యార్థులకు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదు …కాలేజ్ ఫర్ సేల్ అని బోర్డులు పెట్టే పరిస్థితి వస్తుంది …మాట్లాడితే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ,స్కిల్ యూనివర్సిటీ అంటారు ..ఫీజు రీయింబర్స్ బకాయిలు మాత్రం చెల్లించడం లేదు …అసలు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తారా ..లేదా పథకాన్నే రద్దు చేస్తారా ?…ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలి …రైతు బంధు ఇప్పటికే బంద్ పెట్టారు …స్కిల్ యూనివర్సిటీ కాదు ..కిల్ యూనివర్సిటీ చేస్తున్నారు అని దుయ్యబట్టారు.
Also Read:వీడియో..సింహాలతో భీకర పోరు!

