ఎండిన వరితో బీఆర్ఎస్ ఆందోళన

11
- Advertisement -

ఎండిన వరితో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ, మండలిలో ఆందోళన చేపట్టారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అని.. రేవంత్ రెడ్డి పాపం రైతన్నలకు శాపం అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25000 ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. తెలంగాణలో పంటలు ఎండిపోయాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం చేతకానితనం కారణం అని ఆరోపించారు.

గోదావరిలో, కృష్ణాలో నీళ్లు ఉండి వాడుకోలేని తనం కారణం అని.. రాష్ట్ర రైతాంగానికి కేసీఆర్ , బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటదని చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ నాయకులు ఈ దున్నపోతు లాంటి ప్రభుత్వాన్ని నిద్రలేపే వరకు నీళ్ళు ఇవ్వాలని సోయి లేదు అన్నారు. ఈ ప్రభుత్వం 35 రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి నీళ్లు ఇచ్చేసరికి ఒక జనగామ జిల్లాలోనే రూ.600 కోట్ల పంట నష్టం జరిగిందన్నారు.

Also Read:TG Budget 2025-26: కేటాయింపులు ఇవే

- Advertisement -