లండన్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు

7
- Advertisement -

బీఆర్‌ఎస్‌ పార్టీ 26వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా లండన్ లో ఏన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు.ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి గులాబీ జెండా పండుగ నిర్వహించి, అమరవీరులకు, జయశంకర్ సర్ ని స్మరించుకొని నివాళుర్పించి, ఎన్నారైలంతా జై తెలంగాణ…. జై బీఆర్ఎస్ ,,,, జై కెసిఆర్… జై జై కెసిఆర్ నినాదాలతో మార్మోగించారు. అనంతరం కేక్ కట్ చేసి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ప్రారంభించారు.

యూకే లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న ఎందరో తెలంగాణ ఎన్నారైలు , ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో భారీగా తెలంగాణ ఎన్నారైలు పార్టీలో చేరినట్టు సంయుక్త కార్యదర్శి నవీన్ మాదిరెడ్డి తెలిపారు.కెసిఆర్ – కేటీఆర్ నాయకత్వంలో పనిచేయాలనే సంకల్పంతో పార్టీలో చేరుతున్నామని, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కెసిఆర్ గారి నాయకత్వమే శ్రీ రామ రక్షా అని భావిస్తున్నట్టు ఎన్నారైలు తెలిపారు.

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావ వేడుకలను సందర్భంగా క్షేత్రస్థాయిలో , ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు నాయకులకు ఏన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మన ఇంటి పార్టీ మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి , పది సంవత్సరాల కెసిఆర్ పాలనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్‌ఎస్‌ పార్టీని మనం కాపాడుకోవాలని, కెసిఆర్ నాయకత్వమే మనకు శ్రీరామా రక్షా అని ఏన్నారై బీఆర్ఎస్ యూకే కమ్యూనిటీ అఫైర్స్ చైర్ పర్సన్ రమేష్ ఎసెంపల్లి తెలిపారు.

నాటి ఉద్యమం నుండి నేటి వరకు లండన్ నుండి ప్రత్యేక కార్యాచరణతో అనుక్షణం పార్టీ వెంట ఉన్నామని, అవకాశం కలిపించిన కెసిఆర్ గారికి, కేటీఆర్ గారికి ఇతర పార్టీ పెద్దలకు కార్యదర్శి సురేష్ గోపతి కృతఙతలు తెలిపారు.26 సంవత్సరాల గులాబీ పండగ వేళ అన్ని సందర్భాల్లో పార్టీ వెంట ఉన్న ప్రతీ కార్యకర్తలకు, అలాగే లండన్ లో మమ్మల్ని ప్రోత్సహించి నడిపించిన ఏన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపకధ్యక్షుడు అనిల్ కూర్మాచలం గారికి , ప్రతీ ఎన్నారై బీఆర్ఎస్ బాధ్యులకు సంయుక్త కార్యదర్శి ప్రశాంత్ కటికనేని కృతఙ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చే వరకు కెసిఆర్ గారిని ముఖ్యమంత్రిని చేసే వరకు అలుపెరగకుండా పోరాటం చేస్తామని కార్యదర్శి అబ్దుల్ జాఫర్ తెలిపారు.రాబోయి తరాలకు బీఆర్ఎస్ పార్టీ చరిత్రను, కెసిఆర్ గారి పోరాటాన్ని తెలియజేసేలా కృషి చేస్తామని, యువతరమంతా కెసిఆర్ – కేటీఆర్ గార్ల నాయకత్వాన్ని కోరుకుంటుందని, పార్టీ బలపర్చడానికి ఎన్నారై బీఆర్ఎస్ యూకే యువజన విభాగం ప్రత్యేకంగా కృషి చేస్తుందని సంయుక్త కార్యదర్శి అబ్దుల్ ఖుదూస్ తెలిపారు.

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ కెసిఆర్ గారి నాయకత్వమే శ్రీ రామ రక్షా, తెలంగాణ ప్రజలకోసం పని చేసేది, అన్ని సందర్భాల్లో తెలంగాణ ప్రజల పక్షాన నిలిచింది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని, బీఆర్ఎస్ పార్టీని కెసిఆర్ గారి నాయకత్వాన్ని నమ్మిన ప్రజలకు మేలే జరిగిందని కాబట్టి మనమంతా కెసిఆర్ గారి వెంటే ఉండాలని, ఎన్నారైలంతా కెసిఆర్ వెంటే ఉన్నారని ఏన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు & ఎఫ్దీసి మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచలం, ఏన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షులు హరి గౌడ్ నవాపేట్, సత్యమూర్తి చిలుముల, రవి రెటీనేని, అడ్వైసరీ బోర్డు వైస్ చైర్మన్ గణేష్ కుప్పాల, కార్యదర్శి – ఐటీ, మీడియా & పీఆర్ రవి ప్రదీప్ పులుసు, కార్యదర్శులు అబూ జాఫర్,సురేష్ గోపతి, కోశాధికారి సురేష్ బుడగం, కమ్యూనిటీ అఫైర్స్ చైర్మన్ రమేష్ ఇస్సంపల్లి, సంయుక్త కార్యదర్శులు నవీన్ మాదిరెడ్డి, ప్రశాంత్ రావు కటికనేని, మెంబర్షిప్ కో ఆర్డినేటర్: అంజన్ రావు, యూత్ వింగ్ సెక్రటరీ పవన్ కుమార్ గౌడ్, యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ అబ్దుల్ కుదూస్, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ పేరాల,అజయ్ రావు గండ్ర మరియు ముఖ్య సభ్యులు అర్చన, సాయి, అనిల్,రాజు యాదవ్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.

Also Read:IPL:ఎలైట్ క్లబ్‌లోకి ఆర్సీబీ

- Advertisement -