దశాబ్దాల పాటు సాగిన పరాయి పాలన పీడన నుంచి తెలంగాణను విముక్తి చేయడానికి ఓ మహనీయుడు ఇరవై మూడేళ్ల క్రితం మహా సంకల్సాన్ని చేపట్టారు. నాడు తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఆయన ఎత్తిన పిడికిలి లక్ష్యాన్నిచేరుకునే దాకా దించలేదు. ఆయనే మన తెలంగాణ బాపు కేసీఆర్. 2001లో ఎగిరిన గులాబీ జెండా నేడు స్వరాష్ట్రంలో సగర్వంగా రెపరెపలాడుతుంది. బీఆర్ఎస్ ఆవిర్భవించి 23 ఏళ్ళు పూర్తయి..24వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నిరాడంబరంగా వేడుకలు జరుగుతున్నాయి.
కొత్త రాష్ట్రం.. ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు..తెలంగాణ నిలిచి గెలుస్తుందా అంటూ సర్వత్రా అనుమానాలు..కానీ సీఎం కేసీఆర్ దీక్షాదక్షతతో ఆ అనుమానాలన్నీ పటాపంచలు చేశారు. అనతికాలంలోనే తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారు. నేడు ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా చేశారు.. నేడు మన తెలంగాణ దేశంలో అన్నిరాష్ట్రాలకు ఆదర్శంగా మారిందంటే అది కేవలం సీఎం కేసీఆర్ సుపరిపాలనే.
రెండు దశాబ్దాల టీఆర్ఎస్ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు అన్నింటిని ఎదుర్కొని నేడు తెలంగాణలో టీఆర్ఎస్‌ను తిరుగులేని రాజకీయ శక్తిగా నిలబెట్టారు కేసీఆర్. తండ్రికి తగ్గ తనయుడిగా పార్టీని క్షేత్రస్ధాయిలో బలోపేతం చేయడంలో వందశాతం సక్సెస్ అయ్యారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానం, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వాన్ని నడుపడంలోనూ, ఆయా పథకాల రూపకల్పన, అమల్లోనూ, తెలంగాణ ఆత్మగౌరవంతో ప్రజలను నిలబెట్టడంలో శక్తివంచన లేకుండా కృషి చేసింది బీఆర్ఎస్.
ఇక గులాబీ పార్టీ ఆవిర్భవంచి 23 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఆవిర్బావ వేడుకలు నిరాడంబరంగా చేయనున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్లీనరీ వేడుకలు నిరాడంబరంగా నిర్వహించాలని, అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు రెడీ అయ్యారు కేసీఆర్. ఇక పదేళ్ల పాటు తెలంగాణను అభివృద్ధి పథంలో నిలిపిన కేసీఆర్ ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావం..హైలైట్స్
2001 ఏప్రిల్ 27న టీఆర్‌ఎస్ ఆవిర్భావం
2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు
2004 జూన్ 7న రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన
2009 నవంబర్ 29న కేసీఆర్ నిరాహారదీక్ష
2009 డిసెంబర్ 7న సీఎం రోశయ్య అఖిలపక్ష సమావేశం
2009 డిసెంబర్ 9న తెలంగాణపై చిదంబరం ప్రకటన
2009 డిసెంబర్ 23న చిదంబరం రెండో ప్రకటన
2010 డిసెంబర్ 10న శ్రీకష్ణ కమిటీ ఏర్పాటు
2012 డిసెంబర్ 28న కేంద్ర స్థాయిలో రెండో సారి ఆల్‌పార్టీ మీటింగ్, తెలంగాణకు అన్ని పార్టీల మద్దతు
2013 జూలై 30న తెలంగాణకు సీడబ్ల్యూసీ గ్నీన్ సిగ్నల్
2013 డిసెంబర్ 16న టీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ
2014 ఫిబ్రవరి 7న టీ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
2014 ఫిబ్రవరి 17న పార్లమెంటులో టీ బిల్లు ప్రవేశం
2014 ఫిబ్రవరి 18న టీ బిల్లుపై చర్చ ప్రారంభం
2014 జూన్ 2…తెలంగాణ ఆవిర్భావం
Also Read:IPL 2024:ఐపీఎల్ చరిత్రలో రికార్డు ఛేజ్