అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ లక్ష్యంతో ముందుకు వెళ్లుతున్న బీఆర్ఎస్ పార్టీ ఇవాళ న్యూఢిల్లీలో కార్యాలయంను ప్రారంభించనుంది. మధ్యాహ్నం గంట1.05నిమిషాలకు బీఆర్ఎస్ కార్యాలయంను సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు.
అంతకుముందు కార్యాలయంలో నవ చండి హోమం నిర్వహించనున్నారు. అనంతరం వాస్తు పూజలు నిర్వహించనున్నారు. 2021 సెప్టెంబర్ 2 కార్యాలయ నిర్మాణానికి భూమిపూజ చేసిన సంగతి తెలిసిందే. కార్యాలయ నిర్మాణంను ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ చొరవ తీసుకోని దగ్గరుండి నిర్మించారు. ఇందుకుగాను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇతర సీనియర్ నాయకులు నిర్మాణ పనులను పర్యవేక్షించారు.
మొత్తం 1100చదరపు మీటర్ల విస్తీర్ణంలో జీ+3గా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో క్యాంటీన్ కార్యాలయ కార్యదర్శి మేనేజర్ చాంబర్లతోపాటు మీటింగ్ హాల్ నిర్మించారు. మొదటి అంతస్థులో పార్టీ అధ్యక్షుడి ఛాంబర్స్ కాన్ఫరెన్స్ హాల్ వెయిటింగ్ హాల్స్ నిర్మించారు. ఇక రెండో అంతస్తులో డార్మెటరీ రూంలు నేతల బసకోసం ప్రత్యేక సూట్స్ ఏర్పాటు చేశారు. ఇక మూడో అంతస్థులో ప్రత్యేక గదులు సూట్స్ నిర్మించారు.
Also Read: భారత 3వ రాష్ట్రపతి మన హైదరాబాది ..నేడు వర్థంతి
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఇప్పటికే మంత్రులు, బీఆర్ఎస్ నాయకులు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు ఢిల్లీకి చేరుకున్నారు. కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Also Read: KTR:పరిపాలన వికేంద్రీకరణే లక్ష్యం