తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రస్తుతం జాతీయ రాజకీయాలే లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. అందులో భాగంగా టిఆర్‌ఎస్ పార్టీని బిఆర్‌ఎస్ గా రూపాంతరం చేశారు. డిసెంబర్ 9న టిఆర్‌ఎస్ పూర్తి స్థాయిలో బిఆర్‌ఎస్ గా మారింది. దీంతో ఇకపై కేసిఆర్ తీసుకునే ప్రతి నిర్ణయం కూడా జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. ఇక బిఆర్‌ఎస్ ను త్వరగా దేశ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు సిఎం కేసిఆర్. ఇప్పటికే డిల్లీలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించే పనుల్లో వేగం పెంచిన కేసిఆర్. పక్కా రాష్ట్రమైన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాటుకు త్వరత్వరగా అడుగులు వేస్తున్నారు. విజయవాడ జక్కంపూడి ఇన్నర్ రింగ్ రోడ్ హైవే సమీపంలో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మించబోతునట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంచితే నిన్నటి వరకు తెలంగాణ వరకే పరిమితం అయిన కేసిఆర్ ఇప్పుడు పక్కా రాష్ట్రం అయిన ఏపీపై కూడా గట్టిగానే ఫోకస్ చేయనున్నారు. ఏపీలో బలమైన పార్టీలుగా వైసీపీ. టిడిపి, జనసేన పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బిఆర్‌ఎస్ ఏపీలో ఎంతమేర ప్రభావం చూపుతుంది అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అయితే కేసిఆర్ కు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా ఏపీలో కూడా ప్రజా మద్దతు మెండుగానే ఉంది. తెలంగాణలో కేసిఆర్ పరిపాలన విధానంపై అలాగే ఆయన అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఏపీ ప్రజలు సానుకూల భావంతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కూడా కేసిఆర్ ప్రభావం గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఇక రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్న వైఎస్ జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లకు కేసిఆర్ ఎంట్రీ గట్టిగానే షాక్ ఇవ్వనుంది. మొత్తానికి బిఆర్‌ఎస్ ఎంట్రీతో ఏపీ రాజకీయ సమీకరణల్లో చాలానే మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..