తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీ.ఆర్.యస్ నాయకులు ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్ లో కెసిఆర్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. మేమంతా ఉద్యమ సమయం నుండి మీ వెంటే ఉన్నామని ఎలాంటి పరిస్థుతుల్లోనైనా మీ వెంటే ఉంటూ మీ నాయకత్వంలో ముందుకు వెళ్తామని తెలిపినట్టు వ్యక్వస్ధాపక అధ్యక్షుడు , మాజీ ఎఫ్దీసి చైర్మన్ అనిల్ కూర్మాచలం తెలిపారు.
ఒక ఎన్నారైగా పార్టీకి సేవలందించిన నాకు ఎలాంటి రాజకీయ అండ లేకపోయినా, నాకు అత్యుత్తమ రాష్ట్ర కార్పొరేషన్ పదివి ఇచ్చి గౌరవించినందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి అనిల్ కూర్మాచలం కృతఙ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన నిలబడి పార్టీ పిలుపిచ్చిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటామని యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ఎన్నారై బీ.ఆర్.యస్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read:మిగిలిన హీరోలు సాయం చేయరా?