మిగిలిన హీరోలు సాయం చేయరా?

34
- Advertisement -

తమిళనాడు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించడం మొదలుపెట్టారు. అదేంటి ? ఆ వరదల నీళ్లు ఇంకిపోతున్నాయి కదా, ఇంకా విరాళాలు ఏమిటయ్యా బాబు ? ఇది విరాళం ఇవ్వడం ఇష్టం లేని సగటు హీరోల అభిప్రాయం అట. కానీ, భారీ వ‌ర్షాల కారణంగా త‌మిళ‌నాడులోని చాలా ప్రాంతాలు వరదనీటిలో మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని వ‌ర‌ద బాధితుల కోసం ఇప్పటికే, కోలీవుడ్ హీరోలు సూర్య‌, కార్తీ.. 10 ల‌క్ష‌ల రూపాయ‌ల ఆర్థిక స‌హాయాన్ని అందించారు. అలాగే కొంతమందికి ఆహార పదార్థాలను కూడా పంచె ఏర్పాట్లను సూర్య బ్రదర్స్ తీసుకున్నారు.

మొత్తానికి, వర‌ద బాధితుల్ని ఆదుకుని త‌మ ఉదార‌త‌ను మ‌రోసారి చాటుకున్నార‌ని సూర్య బ్ర‌ద‌ర్స్‌ను నెటిజ‌న్లు ప్ర‌శంసిస్తున్నారు. అటు హీరో అజిత్ కూడా మిచౌంగ్ తుఫాన్ బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. తన అభిమాన సంఘాలకు స్పష్టమైన మెసేజ్ ను పాస్ చేశాడు. ముఖ్యంగా తమిళనాడు రాజధాని చెన్నైని వరదలతో ముంచెత్తిన విషయం తెలిసిందే. కాబట్టి, ముందుగా చెన్నైలోని లోతు ప్రాంతాల ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని అజిత్ తన ఫ్యాన్స్ గ్రూప్స్ కి ఆర్ధిక సాయం కూడా చేశాడట. కానీ, మిగిలిన తమిళ హీరోల నుంచి ఇంకా ఎలాంటి ఆర్థిక సాయం అందటం లేదు.

హీరో విశాల్, లారెన్స్ వంటి వారు కొందరు తమ వంతు సాయం అందిస్తున్నా.. స్టార్ హీరోలు విజయ్, కమల హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ వంటి స్టార్ల నుంచి ఇంకా ఎలాంటి సపోర్ట్ అందలేదని తమిళ నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. విజయ్ – కమల్ రాజకీయాల పై ఆసక్తి చూపిస్తున్నారు. వారు కూడా ఇలా సైలెంట్ గా ఉండటం షాక్ కి గురి చేస్తోంది. అన్నట్టు ఈ వరదల్లో చిక్కుకున్న కోలీవుడ్ నటుడు విష్ణువిశాల్‌ కుటుంబాన్ని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. ప్రత్యేక బోట్ల ద్వారా ఆయన ఇంటికి చేరుకుని.. విష్ణు, గుత్తా జ్వాల, బాలీవుడ్ హీర్ ఆమీర్ ఖాన్‌ను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరి ఫైర్‌, రెస్య్కూ బృందానికి, తమిళనాడు ప్రభుత్వానికి ఇబ్బందిలు పడుతున్న సామాన్య ప్రజలు కనిపించడం లేదా ?!!. డబ్బు ఉన్న వారికే సాయం చేస్తారా ?!.

Also Read:Revanth:రేవంత్ రెడ్డికి బిగ్ టాస్క్?

- Advertisement -