ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్

1
- Advertisement -

స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కులం పేరుతో దూషించారనే ఆరోపణల నేపథ్యంలో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధును సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఆయన నివాసంలో ఉదయాన్నే పోలీసులు ప్రవేశించి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరొక బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం లష్యంగా చేసుకుంటోందని బీఆర్ఎస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం “ప్రజా పాలన” ముసుగులో నియంతృత్వ ధోరణిని ప్రదర్శిస్తోందని మండిపడుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యమా లేక నియంతృత్వ పాలనా? ప్రజాప్రతినిధులనే దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకత్వానికి అద్దం పడుతోంది అని విమర్శించారు.

ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ప్రజాప్రతినిధులను గృహ నిర్బంధం చేయడం మరియు అరెస్టు చేయడం చట్ట విరుద్ధమని ప్రతిపక్షం వాదిస్తోంది. అసెంబ్లీ లోపల మరియు వెలుపల ప్రజల తరఫున ప్రశ్నిస్తున్న ఎమ్మెల్సీలపై కక్షపూరితంగా కేసులు నమోదు చేస్తున్నారని బిఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read:వాకింగ్ చేస్తున్నా బ్లడ్ షుగర్ పెరుగుతోందా?

- Advertisement -