మంచి ఆలోచనల పెంపే భోగి…

65
- Advertisement -

పాత ఆలోచనలను భోగి మంటల్లో వేసి కొత్త ఆలోచనలకు నాంది పలకడమే భోగి పండుగ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ భోగి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లో కేబీఆర్ పార్క్‌ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… తెలంగాణ జాగృతి నుంచి భారత్‌ జాగృతిగా రూపాంతరం చెందాక మొదటి సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. మనలోని ప్రతికూలతలను విడిచిపెట్టి నూతన ఉత్సాహంతో ముందుకు సాగుదామని కవిత తెలిపారు. పల్లెవాతావరణాన్ని నగరానికి తీసుకొచ్చిన హైదరాబాద్‌ జాగృతివారిని అభినందించారు. భోగి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఇవి కూడా చదవండి…

‘ భోగి ‘ పండుగ ప్రత్యేకత తెలుసా ?

సంక్రాంతి వచ్చింది…పల్లె రమ్మంది

ఈ నెల 15న దావోస్‌కు కేటీఆర్‌…

- Advertisement -