కవిత ఫైర్.. అండగా నెటిజన్స్ !

60
- Advertisement -

తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థల చేత బీజేపీ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. డిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కమలనాథులు, అలాగే బెంగళూరు డ్రగ్స్ కేసు అంటూ మరో కొత్త అంశాన్ని కూడా తెరపైకి తెచ్చి బి‌ఆర్‌ఎస్ నేతలను గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. కేంద్ర సంస్థలు చేతిలో ఉన్నాయని.. మోడీ సర్కార్ బి‌ఆర్‌ఎస్‌ నేతలపై చేస్తున్న అక్రమ కేసులను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఎందుకంటే అధికార దాహంతో బీజేపీ చేసే అక్రమ వ్యూహాలు ఎలా ఉంటాయో దేశ ప్రజలకు బాగానే తెలుసు. ఇక తెలంగాణలో ప్రధానంగా డిల్లీ లిక్కర్ స్కామ్ ను హైలెట్ చేస్తూ రాజకీయ లబ్ది పొందేందుకు కాషాయ పార్టీ గట్టిగానే ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో మద్యం దందా గురించి వచ్చిన ఓ న్యూస్ ఆర్టికల్ ను బీజేపీనేత కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. ” చార్జ్ షీట్ లో కవితా పేరు 28 సార్లు ప్రస్తావించబడిందని .. ” రాసుకొచ్చారు. ఇక కోమటిరెడ్డి చేసిన ట్వీట్ కు ఎమ్మెల్సీ కవిత గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ” రాజగోపాల్ అన్నా తొందరపడకు.. మాట జారకు !.. 28 సార్లు నా పేరు చెప్పించిన.. 28 వేల సార్లు నా పేరు చెప్పించినా.. అబద్దం నిజం కాదు ” అంటూ గట్టిగా రిప్లై ఇచ్చారు ఎమ్మెల్సీ కవితా. ఇక నెటిజన్స్ కూడా ఎమ్మెల్సీ కవితకు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారు. ” కేంద్ర సంస్థలను అడ్డంపెట్టుకొని అబద్ద ప్రచారాలు చేసినంత మాత్రాన అబద్దలు నిజాలు అయిపోవు ” అంటూ మోడీ సర్కార్ పై గట్టిగా మండి పడుతున్నారు నెటిజన్స్. మొత్తానికి రాజ్యాంగ బద్దంగా వ్యవహరించాల్సిన సంస్థలను మోడీ సర్కార్ అరచేతిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చదవండి…

6వ తరగతి నుంచే..’డిజిటల్ విప్లవం’!

తల్లీబిడ్డల క్షేమం కోసమే ఈ కిట్‌:హరీశ్‌

కమలం పార్టీ స్లో అయిందా?

- Advertisement -