ఆటోలో అసెంబ్లీకి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు

22
- Advertisement -

ఆటో డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీకి ఆటోలో చేరుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డుపై పడ్డాయన్నారు హరీష్ రావు. రెండు నెలల్లో 21 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు.

ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే ఆటో కార్మికులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత సర్కారుపై ఉందన్నారు సత్యవతి రాథోడ్. చనిపోయిన డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఆటో డ్రైవర్లను ఆదుకోవాలంటూ ఉన్న ప్లకార్డులను సభలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే నల్ల కండువాలతో శాసనమండలిలో వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను అడ్డుకున్నారు పోలీసులు.

Also Read:Vijay: ‘ఫ్యామిలీ స్టార్’ తో హిట్ కొడతాడా?

- Advertisement -