అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా లోకం భగ్గుమంది. అసెంబ్లీ సాక్షిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై చేసిన కామెంట్స్ సరికావని, సీఎం, డిప్యూటీ సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలకు దిగగా అసెంబ్లీకి బీఆర్‌ఎస్ శాసనసభ్యులు నల్లబ్యాడ్జీలు ధరించి సభకు హాజరయ్యారు. మహిళా ఎమ్మెల్యేలకు సీఎం, డిప్యూటీ ఎంసీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే మంత్రి శ్రీధర్ బాబు స్కిల్ యూనివర్సిటీ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.
ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు చేసిన ఈ వ్యాఖ్యలు వారిద్దరిపై మాత్రమే కాదు మొత్తం మహిళలపై వారికున్నా చులకన భావాన్ని తెలియజేస్తుందన్నారు.
Also Read:ఎస్టీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీం సంచలన తీర్పు