మార్క్ ఫెడ్ అధికారులపై ఎమ్మెల్యే ఫైర్

8
- Advertisement -

మార్క్ ఫెడ్ అధికారులపై ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజులుగా మక్కలు ఎప్పుడు కొంటారని రైతులు రోడ్ల మీద ఎదురు చూస్తుంటే మజాక్ గా ఉందా?..ఎందుకింత అహంకారం మీకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈరోజు వెంటనే మొక్కజొన్న కేంద్రాలను అధికారులు తెరవకుంటే, నేను వెళ్ళి తెరుస్తా…కోరుట్ల నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంలో జాప్యంపై మార్క్ ఫెడ్ అధికారులపై మండిపడ్డారు.

రైతులు నెల రోజుల నుండి ఇబ్బందులు పడుతుంటే మీకు కామెడీగా ఉందా?,మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభించమంటే నాలుగు రోజుల తర్వాత తెరుస్తామని అంటారా? ఇదేనా మీ బాధ్యత అని ప్రశ్నించారు. ఈరోజు నేను వెళ్ళి మొక్కజొన్న కేంద్రాలను ప్రారంభిస్తాను.. మీరు వస్తారా రారా మీ ఇష్టం అంటూ మార్క్ ఫెడ్ అధికారులపై మండిపడ్డారు.

Also Read:ఇరాన్‌తో చర్చలకు అమెరికా ఉపాధ్యక్షుడు

- Advertisement -