కాంగ్రెస్‌ను కాపాడుతున్న బీజేపీ!

1
- Advertisement -

కాంగ్రెస్‌కు హటావో దేశ్ కో బచావో అంటూ మోడీ చెబుతారు ఇక్కడ కాంగ్రెస్ను కాపాడండి తెలంగాణను భ్రష్టు పట్టించండి అన్న రీతిలో బిజెపి ప్రవర్తిస్తుంది అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన సంజయ్.. శాసనసభలో బిజెపి ఎమ్మెల్యేలు బయట కేంద్ర మంత్రులు కాంగ్రెస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు…రేవంత్ తో బీజేపీ ఎమ్మెల్యేలు డీలింగ్ లు పెట్టుకుని బీ ఆర్ ఎస్ ను విమర్శిస్తున్నారు అన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు.. సభలో నిన్న కేటీఆర్ ను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని భట్టి వ్యాఖ్యానించడం సబబు కాదు..సీనియర్ శాసన సభ్యురాలు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని ఏ మొహం పెట్టుకుని సభకు వచ్చారు అని భట్టి అవమానించారు అన్నారు.మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలనే కేటీఆర్ సభ దృష్టికి తీసుకువచ్చారు.. 30% తీసుకొని కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తున్నారని కాంగ్రెస్ నేతల మాటల్ని సభ దృష్టికి తీసుకువచ్చారు..కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేశారు.

Also Read:ఢిల్లీలో కుస్తీ…గల్లీలో దోస్తీ: వివేకా

- Advertisement -