Jagadish Reddy: రైతులను తప్పుదోవ పట్టిస్తున్న సీఎం రేవంత్

22
- Advertisement -

రైతులను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. శాసనసభలో విద్యుత్ పద్దులపై చర్చ సందర్భంగా మాట్లాడిన జగదీష్ రెడ్డి…. మొన్న ఇదే స‌భ‌లో హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 30 వేల కోట్ల న‌ష్టానికి సిద్ధ‌ప‌డ్డాం కానీ బోరు బావుల వ‌ద్ద మీట‌ర్లు పెట్ట‌లేదు అని గుర్తు చేశారు.

హ‌రీశ్‌రావు కేవ‌లం ఉద‌య్ ప‌థ‌కం గురించి చెప్పారని…. ఈ ప‌థ‌కంలో 27 రాష్ట్రాలు చేరాయన్నారు. ఈ ప‌థ‌కం డిస్క‌లం ఆర్థిక ప‌రిస్థితిని స‌రిదిద్ద‌డానికి తీసుకొచ్చారు. ఉద‌య్ ప‌థ‌కంలో మా కంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు చేరాయన్నారు. ఆ త‌ర్వాత మేం కూడా చేరాం.. సీఎం ప్ర‌జ‌ల‌ను, రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారన్నారు.

టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చిన రాష్ట్రం అంధ‌కారం అయింద‌ని రాజ‌గోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు… ఒక్క ట్రాన్స్‌ఫార్మ‌ర్, పోల్స్ పెట్ట‌లేద‌ని చెబుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ వ‌చ్చిన త‌ర్వాత ఇండ్ల మీద నుంచి విద్యుత్ లైన్లు వెళ్ల‌లేదు అని గుర్తు చేశారు. 2014కు ముందు విద్యుత్ పీక్ డిమాండ్ 5661 మెగ‌వాట్లు.. మేం అధికారంలోకి వ‌చ్చాక పీక్ డిమాండ్ 15497 మెగావాట్లు అని పేర్కొన్నారు.

Also Read: TTD:ఆగస్టులో తిరుమలలో విశేష ఉత్సవాలు

- Advertisement -