బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో.. రెడీ !

31
- Advertisement -

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది పోలిటికల్ హీట్ రోజు రోజుకు పెరుగుతోంది. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల సమరానికి సిద్దమౌతున్నాయి. ఎన్నికల రేస్ లో అధికార బి‌ఆర్‌ఎస్ శరవేగంగా దూసుకుపోతుంది. ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇచ్చిన బి‌ఆర్‌ఎస్.. ఇక ఇప్పుడు మేనిఫెస్టో ప్రకటనకు సిద్దమౌతుండడంతో రాజకీయ వర్గాల్లో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఎందుకంటే ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పన చేసే సి‌ఎం కే‌సి‌ఆర్ ఈసారి మేనిఫెస్టోలో ఎలాంటి హామీలను పొందుపరిచారనే ఆసక్తి ప్రజల్లో నెలకొంది..

ఇక ప్రత్యర్థి సైతం బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో పై దృష్టి సరిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలు ఐదు హామీల పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది. కానీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితి లేకపోవడంతో కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజల్లో ఆసక్తి కొరవడింది. దానికి తోడు తెలంగాణలో ప్రకటించిన హామీలను గతంలో కర్నాటక రాష్ట్రంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రకటించింది హస్తం పార్టీ. కానీ ఎన్నికల్లో ప్రకటించిన హామీలను అక్కడ అమలు చేయడానికి హస్తం పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

దీంతో ఆల్రెడీ అధికారంలో ఉన్న రాష్ట్రంలోనే అమలు చేయలేని హస్తం పార్టీ తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని ప్రజలు ఏ మాత్రం భావిచడం లేదు. అందుకే హస్తం పార్టీ ప్రకటించిన ఐదు హామీలను ప్రజలు లైట్ తీసుకున్నారు. ఇక హామీల అమలు విషయంలో ఏ మాత్రం సంకోచించని సి‌ఎం కే‌సి‌ఆర్ ప్రకటించే మేనిఫెస్టో కోసం ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ నెల 16న బి‌ఆర్‌ఎస్ మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని మంత్రి హరీష్ రావు చెప్పడంతో అందరి దృష్టి 16 తేదిపై పడింది. ఇక మేనిఫెస్టో ప్రకటన తరువాత నుంచి ప్రచారంలో వేగం పెంచేందుకు బి‌ఆర్‌ఎస్ శరవేగంగా అడుగులు వేస్తోంది.

Also Read:రజనీతో అమితాబ్ – కమల్!

- Advertisement -