2024 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా విపక్షాలు ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపక్షాల ఐక్యత కోసం బిహార్ లోని పాట్నాలో నితీశ్ కుమార్ అధ్యక్షతన ఓ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, కేజ్రివాల్, స్టాలిన్, శరద్ పవార్, అఖిలేశ్ యాదవ్.. వంటి ఎందరో రాజకీయ ఉద్దండులు హాజరయ్యారు. అయితే ఈ సమావేశానికి బిఆర్‌ఎస్ అధినేత కేసిఆర్ మాత్రం దూరం వహించారు. కేసిఆర్ కూడా మొదటి నుంచి విపక్షాల ఐక్యతను కోరుకుంటూ వచ్చారు. దీంతో ఆయన పాట్నా సమావేశానికి ఎందుకు హాజరు కాలేదు అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
Also Read: ఈటెల, కోమటిరెడ్డిపై.. కాషాయపార్టీకి నమ్మకం లేదా ?
దీనిపై తాజాగా ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ స్పష్టత నిచ్చారు. ఏకం కావాల్సింది దేశంలోని పార్టీలు కాదని, ప్రజలంతా ఏకం కావాలని కేటిఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు ఒక్కటేనని, ఈ రెండిటికి బిఆర్‌ఎస్ ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని.. హైదరబాద్ కేంద్రంగానే బిఆర్‌ఎస్ రాజకీయాలు చేస్తుందని, ఇక్కడి నుంచే దేశ రాజకీయాలను చక్రం తిప్పుతామని కేటిఆర్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. కాంగ్రెస్ కలిసే ఏ విపక్ష కూటమితోను బిఆర్‌ఎస్ కలవదని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఎలాంటి ఎజెండాతో ముందుకు సాగబోతుంది.. బీజేపీని గద్దె దించడానికి ఎలాంటి వ్యూహాలను అమలు చేయనుంది అనేది దేశ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశం అవుతోంది.
Also Read: VinodKumar:అక్కడ మరో ప్రత్యామ్నాయం లేదు..