SCCL:సింగరేణి కార్మికుల మహాధర్నా

61
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా చేపట్టాయి. భూపాలపల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, గోదావరిఖని, రామగుండం, మందమర్రి, నస్పూర్‌, ఇల్లందులో ధర్నాకు దిగారు. బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. గోదావరిఖనిలో టీబీజీకేఎస్‌ నేత కెంగర్ల మల్లయ్య ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. మోదీ హటావో సింగరేణి బచావో అంటూ నినాదాలు చేస్తున్నారు.

భూపాలపల్లిలో నిర్వహించనున్న ధర్నాలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ , కొత్తగూడెంలో మంత్రి పువ్వాడ, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు సింగరేణి ధర్నాలో పాల్గొని నిరసన తెలుపనున్నారు.

శ్రీరాంపూర్‌ ఏరియాలోని అన్ని భూగర్భ గనులు, ఓపెన్‌ కాస్ట్‌లపై టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బొగ్గుగనుల ప్రైవేటీకరణను వెంటనే ఆపాలని డిమాండ్‌ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని చౌరస్తా దగ్గర నిర్వహించే మహాధర్నాలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, టీబీజీకేఎస్‌ నాయకులు పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -