ECతో బీఆర్ఎస్ నేతల భేటీ..

7
- Advertisement -

భారత ఎన్నికల కమిషన్ అధికారుల పిలుపుమేరకు ఇవాళ సమావేశం కానున్నారు బీఆర్ఎస్ నేతలు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఇప్పటికే ఢిల్లీకి చేరారు బీఆర్ఎస్ నేతలు.

పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు సమావేశానికి రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేష్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర మరియు వినోద్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ హాజరుకానున్నారు.

ఎన్నికల సంస్కరణలు, ఇప్పటికే ఈసీఐకి సమర్పించిన వివిధ అభ్యర్థనలు,ఎన్నికల ప్రవర్తన నియమావళి సంబంధిత అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరగనుంది. వివిధ పార్టీల నేతలతో ఎన్నికల సంఘం సమావేశం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:అడివి శేష్..’G2’రిలీజ్ డేట్

- Advertisement -