మోడీ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతల ఫైర్

19
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో మాట్లాడిన మంత్రి కేటీఆర్… రూపాయి కడితే 46 పైసలు ఇస్తున్నారు.. జాకీలు పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదన్నారు. ఆ పార్టీ పని ఎప్పుడో అయిపోయింది.. దింపుడు కల్లం ఆశ తో పసుపు బోర్డు ప్రకటన.. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ జాతికి ద్రోహం చేశాయన్నారు.

()ఇక నిర్మిల్‌లో మాట్లాడిన కేటీఆర్… క‌రెంట్ గురించి మాట్లాడ‌డానికి కాంగ్రెస్ నాయ‌కుల‌కు ఇజ్జత్ ఉండాలె అన్నారు. దేశంలో రైతుల‌కు 24 గంట‌ల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే…. రెండు సార్లు కేసీఆర్‌ను ఆశీర్వదించి, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని న‌డుప‌మ‌ని అవ‌కాశం ఇచ్చారన్నారు. మ‌ళ్లీ ఎల‌క్షన్లు వ‌స్తున్నాయి. ఈ తొమ్మిదిన‌రేండ్లలో ఏం చేశామో.. మ‌ళ్లా ఎందుకు ఓటేయాల‌ని కోరుతున్నామో.. చెప్పడానికి వ‌చ్చాం. మేం చేసింది, చెప్పింది నిజ‌మైతే క‌డుపు నిండా ఓట్లు వేయండి. ఒక వేళ మేం చెప్పింది త‌ప్పయితే ఓట్లు వేయ‌కండన్నారు.

Also Read:రేపటి నుంచే స్టార్ట్.. వారికి ఇదే చివరి వరల్డ్ కప్?

నిన్న‌ ప్రధాని మోదీ.. గాలి మోట‌ర్లో వ‌చ్చి గాలి మాట‌లు మాట్లాడిండు . బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక‌టే ఆయన అంట‌డు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెసోళ్లు అంట‌రు. నేను ఒక్కటే చెప్తున్నా.. బీజేపీ కాంగ్రెస్ నాయ‌కుల‌కు. మేం రోషంగ‌ళ్ల బిడ్డలం. ఆత్మగౌర‌వం క‌లిగిన బిడ్డలం. మేం ఢిల్లీ గులామ్‌లం కాదు.. గుజ‌రాతీ గులామ్‌లం కాదు.. ఢిల్లీకి బానిస‌లం కాదు అన్నారు. ఒక‌ప్పుడు సాగునీళ్ల కోసం రైతులు త‌న్నుకునే ప‌రిస్థితి ఉండే.. కాల్వల‌పై పెట్టిన మోటార్లను కాంగ్రెస్ పాల‌న‌లో అధికారులు కాల్వలో త‌న్నిన ప‌రిస్థితి.. విద్యుత్ వైర్లను కోసేసిన ప‌రిస్థితి. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు. కాల్వల‌పై మోటార్లు పెట్టి.. బ్రహ్మాండంగా నీళ్లు పారించుకుంటున్నారు. ఇవాళ మ‌న‌కు కేసీఆర్ ధైర్యం. రైతు ర‌క్షణ క‌వ‌చం మ‌న ముఖ్యమంత్రి కేసీఆర్. ఒక‌ప్పుడు ఎస్సారెస్పీ ఎండిపోయి ఆగ‌మ‌య్యేది. మ‌నం రివ‌ర్స్ పంపింగ్ చేప‌ట్టిన త‌ర్వాత ఎస్సారెస్పీ నిండుకుండ‌లా మారింది. స‌ముద్రంలాగా క‌న‌బ‌డుతుంది. ఇది కేసీఆర్ వ‌ల్లే సాధ్యమైంది. సాగునీటి విష‌యంలో క‌ష్టాలు త‌ప్పాయి.. కాబ‌ట్టి ఓటు వేసే ముందు రైతులు ఆలోచించాలి. 24 గంట‌ల‌ క‌రెంట్ వ‌స్తుందంటే.. రైతుబంధు తీసుకొని ధైర్యంగా వ్యవ‌సాయం చేస్తున్నాడంటే అందుకు కేసీఆర్ కార‌ణం. రైతుబీమాతో రైతుల కుటంబాల‌ను ఆదుకుంటున్నాం. అదే విధంగా కేసీఆర్ వ‌డ్లను కొంటున్నాడు. న‌రేంద్ర మోదీ కొన్నా కొన‌క‌పోయినా.. న‌ష్టమొచ్చినా భ‌రిస్తాడ‌నే విశ్వాసం, న‌మ్మకం రైతుల‌కు ఏర్పడిందన్నారు.

() నిజామాబాద్‌ సభలో ప్రధాని మోదీ నీచ స్థాయికి దిగజారి మాట్లాడారన్నారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. తెలంగాణకు నిధులు కేటాయిస్తారని ఆశపడ్డాం. దానికి భిన్నం తెలంగాణ సమాజాన్ని అగౌరపరిచేలా.. కేసీఆర్ ను అవమాన పరిచేలా.. మాట్లాడడం జుగుప్సకరం. సీఎంలు, ప్రధానితో ఎన్నో విషయాలు చర్చిస్తారు. వాటిని రాజకీయాలకు వాడుకోవడం సిగ్గు చేటు. కేటీఆర్ సీఎం కావడానికి మోదీ ఆశీర్వాదం అవసరం‌లేదు. నిన్ను‌ అడిగేవాడు ఎవరు లేరు. కేటీఆర్‌ను సీఎం చేయాలంటే ప్రజలు అనుకుంటే అడ్డుకోవడం నీ అయ్య నుంచి కూడా కాదు అని జోస్యం చెప్పారు.

()ఇక కొడంగల్‌లో మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వర‌లోనే బీఆర్ఎస్ మేనిఫెస్టోను సీఎం కేసీఆర్ విడుద‌ల చేస్తారు కోస్గి, కొడంగ‌ల్‌లో ఒక‌ప్పుడు మంచి నీటి క‌ష్టాలుండేవి.. మూడొద్దుల‌కు ఒక‌సారి నీళ్లు వ‌చ్చేవ‌ని హ‌రీశ్‌రావు గుర్తు చేశారు. ట్యాంక‌ర్ల వెంట నీళ్ల కోసం ప‌రుగెత్తేవారు. గ‌తంలో బోరింగ్‌లు కొట్టి, నీల్లు మోసి ఇబ్బంది ప‌డ్డారు. ఇప్పుడు ఇంటింటికీ న‌ల్లా పెట్టి నీళ్లు అందిస్తున్నాం. కొడంగ‌ల్ ఆడ‌బిడ్డల క‌ష్టాలు తీర్చారు సీఎం కేసీఆర్. రేవంత్ రెడ్డి గెలిచి ఉంటే మ‌రో 10 ఏండ్లు అయినా మంచినీళ్లు రాక‌పోయేవి. మీ పక్కనే కర్ణాటక ఉంది. అక్కడ కల్యాణ లక్ష్మి ఉందా. 12 లక్షల పెళ్లిళ్లకు రూ. 11 వేల కోట్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.

()తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ చాలా బాధాకరం అన్నారు మంత్రి తలసాని. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మంత్రిగా పని చేశాను. చంద్రబాబు అక్రమ అరెస్ట్ వ్యక్తిగతంగా తనకెంతో బాధను కలగచేసింది. అధికారం శాశ్వతం కాదు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాలల్లో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విచారకరం అన్నారు.

Also Read:ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే..

- Advertisement -