ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడియం శ్రీహరి కాంగ్రెస్‌లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి. ప్రతినిత్యం విలువల గురించి మాట్లాడే కడియం…ఇప్పుడు ఏం సమాధానం చెబుతారన్నారు. బీసీలు, దళితులను రాజకీయంగా ఎదగనీయకుండా కడియం శ్రీహరి అడ్డుకున్నారని ఆరోపించారు.
కడియంకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇస్తే.. పార్టీపై తప్పుడు ప్రచారం సరికాదని అన్నారు. ఏ నేతకు ఇవ్వని విధంగా కడియంకు అవకాశాలు ఇచ్చారని కానీ ఇప్పుడు వెన్నుపోటు పొడిచారన్నారు. వ్వలేదని పేర్కొన్నారు.కడియం రాజీనామా లేఖ ఆశ్చర్యం కలిగించిందని…ఈనెల 31నాటి పార్టీ కార్యక్రమం కోసం మాట్లాడినపుడు కూడా ఈ విషయం చెప్పలేదన్నారు. శ్రీహరి ఏ పార్టీలో ఉన్నా, అణచివేత ధోరణితో ఎంతోమందిని బలిపశువును చేశారని ఆరోపించారు. కడియం రాజీనామాతో ఆయన ఫోటోలను తొలగించారు పార్టీ నేతలు.
Also Read:Nara Rohith:ప్రతినిధి 2 టీజర్