బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ దిష్టిబొమ్మ దహనం చేశారు బీఆర్ఎస్ నేతలు. బీసీలకు న్యాయం చేయకుండా తప్పుడు విధానాలతో రిజర్వేషన్లను తొక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ బంజారాహిల్స్ అగ్రసేన్ మహారాజ్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాకేశ్ కుమార్,ఆంజనేయ గౌడ్, దూదిమెట్ల బాల్‌రాజ్ యాదవ్, రాజీవ్ సాగర్, బిక్షపతి, మాజీ బీసీ కమిషన్ మెంబర్లు సుమిత్ర ఆనంద్, కిశోర్ గౌడ్, ఉపేందర్ చారి, బీఆర్ఎస్ నాయకులు రాజారాం యాదవ్, అభిలాష్ రంగినేని, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను బలవంతంగా అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు.
Also Read:42 శాతం రిజర్వేషన్లు..చారిత్రాత్మక నిర్ణయం

