హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్‌ను కలసి కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఉన్న మైనింగ్ అక్రమాల ఆరోపణలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
బీఆర్‌ఎస్ శాసన సభా పక్ష బృందం….మంత్రి పొంగులేటిపై ఉన్న ఆరోపణలను వివరంగా గవర్నర్‌కు వివరించింది. మైనింగ్ కార్యకలాపాల్లో జరిగిన అక్రమాలు, అవకతవకలపై విచారణ జరిపించాలని కోరినట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో కేటీఆర్ (వర్కింగ్ ప్రెసిడెంట్),టి హరీష్ రావు,తలసాని శ్రీనివాస్ యాదవ్,సబితా ఇంద్రా రెడ్డి,సిరికొండ మధుసూధనా చారి..ఇతర మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా హాజరయ్యారు.ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. బీఆర్‌ఎస్ నేతలు చేసిన ఫిర్యాదులపై గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్నది ఆసక్తిగా మారింది.
Also Read:కొవిడ్ కొత్త వేరియంట్..లక్షణాలివే!

