భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు రేపు జరగనున్న సంగతి తెలిసిందే. మన్మోహన్ అంత్యక్రియల్లో పాల్గొననున్నారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలోని పార్టీ ఎంపీలు, నాయకుల బృందం ఘన నివాళులర్పించనుంది.
మన్మోహన్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారు. ఈ సందర్భంగా మన్మోహన్ సేవలను గుర్తు చేసుకున్నారు కేసీఆర్.
తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్‌తో ఉంది… వారి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధముందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు అన్నారు కేసీఆర్. తెలంగాణ సమాజానికి అత్యంత ఆప్తుడైన మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళులు అర్పించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించిందని… వారి కడసారి వీడ్కోలు సందర్భంగా అంత్యక్రియల్లో పాల్గొనాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను, ఎంపీలను ఆదేశించాను అని చెప్పారు కేసీఆర్.
Also Read:మన్మోహన్‌కు ప్రధాని మోదీ నివాళి