ఇదేనా ప్రజాస్వామ్య స్పూర్తి?: బీఆర్ఎస్

187
- Advertisement -

పెద్దపల్లి జిల్లా ధర్మారం లో బీఆర్ఎస్ నాయకులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు బీ ఆర్ ఎస్ నేతలు చిరుమళ్ల రాకేష్ కుమార్ ,గెల్లు శ్రీనివాస్ యాదవ్ ,అభిలాష్ రంగినేని ,కురువ విజయ్ కుమార్ . తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన విజయ్ కుమార్.. కాంగ్రెస్ నాయకులు పొలీసులను అడ్డం పెట్టుకొని మా బీఆర్ఎస్ నాయకులపై దాడి చేశారు అన్నారు.

మీరు అధికారం కోసం 6 గ్యారెంటీలు అడ్డగోళి హమీలు దిక్కుమాలిన డిక్లరేషన్ లు ఇచ్చి అధికారంలోకి వచ్చారు…ఏమి సాధించారో ఏమి నిధులు ఇచ్చారో చెప్పండి.ఇచ్చిన హామీలు అమలు చేయమంటే దాడులు చేస్తున్నారు అన్నారు. అబివృద్దిపై చర్చ పెట్టాలి అన్నారు చర్చకు వస్తే ఈ విధంగా దాడి చేశారు. తెలంగాణాలో 6 గ్యారెంటీల తో పాటు 7వ గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పుతాం అన్నారు…ప్రజాస్వామ్య పద్దతిలో మా BRSనాయకులు,కార్యకర్తలు సామాజిక మాధ్యమాలలో ప్రశ్నిస్తే అడ్డమైన కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తూ జైళ్లకు పంపుతున్నారు అన్నారు.

ఇదేనా మీ ప్రజాస్వామ్య స్పూర్తి ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశమంతా రాజ్యాంగ బుక్కును చేతిలో పట్టుకొని తిరుగుతూ ఇక్కడ తెలంగాణాలో మాత్రం మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుంది దీనిని తీవ్రంగా కండిస్తున్నాం అన్నారు.ఘోష్ కమిషన్ గడువు ముగిసింది అన్నారు.ఇక ఎవరిని పిలువం అన్నారు..మళ్ళీ డైవెర్షన్ పాలిటిక్స్ కోసం మళ్ళీ కమిషన్ నోటీస్ లు అంటున్నారు.ఇప్పటివరకు 7 సార్లు కమీషన్ గడువు పొడిగించారు. రాజకీయ ప్రేరేపిత ఇలాంటి కమిషన్ లతో కెసిఆర్ గారిని మా బీ ఆర్ ఎస్ పార్టీని మమ్ములను భేదిరించలేరు అని తేల్చిచెప్పారు.

Also Read:ఓదెల 2…ఓటీటీలో సరికొత్త రికార్డు!

- Advertisement -