కొండాపై ఈసీకి ఫిర్యాదు

9
- Advertisement -

కొండా సురేఖను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది బీఆర్ఎస్. ఇటీవల ఓ ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే ఎన్నికల కోసం రూ.70 కోట్లు ఖర్చు చేశానని వ్యాఖ్యలు చేశారు కొండా మురళి.

ఒక అభ్యర్థి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధమని, డబ్బుతో ఓట్లును కొన్నట్లు వ్యాఖ్యలు ఉన్నాయని కొండా సురేఖను ఎమ్మెల్యే పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది.

ఇటీవల వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాట్లాడిన కొండా.. గత ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేసి గెలిచాము అని వెల్లడించారు.అంతేగాదు ఎన్నికల కోసం తనకున్న 500 ఎకరాల్లో 16ఎకరాలు అమ్మేశానని…నా రాజకీయ జీవితంలో ఉన్నతవర్గాలతోనే పోటీ అని చెప్పుకొచ్చారు. తనకు ఎవరి పైసలు అవసరం లేదు… నేను ఎవరినీ ఇబ్బందిపెట్టలేదు.. ఎవరికీ భయపడను అని తెలిపారు.

Also Read:Harishrao:నీటి హక్కులపై చర్చకు సిద్ధం

- Advertisement -