కవాసీ లఖ్మాను పరామర్శించిన సీతక్క

8
- Advertisement -

చత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్ సెంట్రల్ జైలులో ఉన్న ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాజీ మంత్రి కవాసీ లఖ్మాను పరామర్శించారు మంత్రి సీతక్క. లఖ్మా కుటుంబ సభ్యులు, అనుచరులకు సంఘీభావం తెలిపారు.

మాజీ మంత్రి, ఆరు సార్లు ఎమ్మెల్యే, ఆదివాసీల‌ అగ్ర నేత క‌వాసీ లఖ్మాని అకార‌ణంగా అరెస్టు చేశారు అన్నారు సీతక్క. రాజ‌కీయ కక్ష‌సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే లఖ్మాని బీజేపీ ప్ర‌భుత్వం అక్ర‌మ కేసుల‌తో వేధిస్తోంది అన్నారు.

బ‌స్త‌ర్ లో ఆదివాసీల గొంతుక‌గా ఉన్న ల‌ఖ్మా అక్ర‌మ అరెస్టును ఖండిస్తున్నాం అని తెలిపిన సీతక్క..ఆపరేషన్ కగార్ పేరిట ఆదివాసీలను బీజేపీ ప్ర‌భుత్వం బలవంతంగా తరిమేస్తోంది అన్నారు. కవాసీ లఖ్మా కుటుంబానికి కాంగ్రెస్ అండ‌గా నిలుస్తోంది అని తెలిపారు.

Also Read:కాంగ్రెస్ హయాంలోనే బనకచర్ల ప్రారంభం

- Advertisement -