మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అరెస్ట్

3
- Advertisement -

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లో నరేందర్‌రెడ్డి నివాసంలో ఆయనను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్​కు తరలించారు. వికారాబాద్‌ జిల్లా లగచర్లలో కలెక్టర్​, అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న సురేశ్​తో పట్నం నరేందర్‌రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే లగచర్ల ఘటనలో 57 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మంగళవారం రాత్రి 16 మందిని రిమాండ్‌కు తరలించారు. మరికొంత మందిని సైతం విచారిస్తున్నారు. సెల్‌ఫోన్‌ టవర్‌ లొకేషన్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సూత్రధారుల వ్యవహారంలో కీలక సమాచారం సేకరించారు. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును మాజీమంత్రులు కేటీఆర్​, హరీశ్​రావు, సబితాఇంద్రారెడ్డి ఖండిస్తూ ఎక్స్​ వేదికగా స్పందించారు.

Also Read:TTD:18న కార్తీక దీపోత్సవం

- Advertisement -